rahul gandhi: 'లేడీస్ అండ్ జంటిల్మన్...మన విమానం రెక్కలు విరిగిపోయాయి' అంటూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
- నోట్లరద్దు, జీఎస్టీని విమర్శిస్తూ వ్యాసం రాసిన యశ్వంత్ సిన్హా
- ఆ కథనంపై కామెంట్ చేసిన రాహుల్ గాంధీ
- విమానం (దేశం) రెక్కలు (ఆర్థిక పరిస్థితి) విరిగిపోయాయన్న రాహుల్ గాంధీ
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాహుల్ సూచన
'ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరిట కరెన్సీ రద్దు, జీఎస్టీపై మండిపడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రాసిన వ్యాసాన్ని ఏఐసీసీ డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో 'లేడిస్ అండ్ జెంటిల్మన్. మీ కోపైలట్, ఆర్థికమంత్రి మాట్లాడుతున్నారు. త్వరగా సీటు బెల్టు పెట్టుకొని, దృఢంగా కూర్చోండి. మన విమానం రెక్కలు విరిగిపోయాయి' అంటూ దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి రాహుల్ సెటైర్ వేశారు.
ప్రధాని మోదీ ఎవరి మాట వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక తీవ్రంగా దెబ్బతిందని గతంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.