north korea: ఉత్తర కొరియాపై నిషేధం విధించిన మరో దేశం
- ఉత్తర కొరియాపై మలేషియా నిషేధం
- అక్కడకు వెళ్లవద్దంటూ తమ ప్రజలకు హెచ్చరిక
- తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం
శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్న ఉత్తర కొరియాపై మరో దేశం నిషేధం విధించింది. ఉత్తర కొరియాకు వెళ్లరాదంటూ తన దేశ ప్రజలపై నిషేధం విధించింది మలేషియా. తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
గతంలో ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ సోదరుడు దారుణ హత్యకు గురైన తర్వాత ఈ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.