america: అమెరికాలో సునీల్ గవాస్కర్ పేరుతో స్టేడియం... స్వయంగా ఆవిష్కరించనున్న క్రికెటర్
- కెంటకీలోని లూసివిల్లేలో ఉన్న స్టేడియం
- ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రికెటర్
- ఆనందంగా ఉందన్న సునీల్
తన క్రికెట్ కెరీర్లో ఎన్నో చెప్పుకోదగ్గ ఘనతలను క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంపాదించారు. ఎంతోమంది యువక్రికెటర్లకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. కొత్తగా ఆయన మరో ఘనత సాధించారు. అమెరికాలోని కెంటకీ ప్రాంతంలో లూసివిల్లేలోని ఓ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.
`సునీల్ గవాస్కర్ ఫీల్డ్` అనే ఈ స్టేడియాన్ని ఆయనే స్వయంగా ఆవిష్కరించనున్నారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత క్రికెటర్గా ఆయన నిలిచారు. ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. `క్రికెట్కు పెద్దగా ప్రాచుర్యం లేని అమెరికా లాంటి దేశంలో ఓ క్రికెటర్ పేరు మీద స్టేడియం నిర్మించడం నిజంగా పెద్ద గౌరవం` అని సునీల్ అన్నారు.