banaras hindu university: విద్యార్ధినుల వేషధారణపై ఎలాంటి నియంత్రణలు ఉండవు: బెనారస్ హిందూ యూనివర్శిటీ
- అమ్మాయిలకు స్వేచ్ఛ ఉంది
- వారిపై నియంత్రణలు ఉండవు
- అమ్మాయిల దుస్తులపై అబ్బాయిలకు ఏంటి ప్రాబ్లం?
విద్యార్థినుల స్వేచ్ఛను హరించే ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోమని బెనారస్ హిందూ యూనివర్శిటీ తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్ గా నియమితులైన రోయనా సింగ్ స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్ వంటి వాటికి సంబంధించి అమ్మాయిలపై ఎలాంటి నియంత్రణ ఉండదని ఆమె చెప్పారు. క్యాంపస్ మెస్ లలో మాంసాహారంపై నిషేధం కూడా ఉండదని తెలిపారు.
అమ్మాయిలు తమకు సౌకర్యవంతమైన దుస్తులను వేసుకోలేకపోతే... అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని ఆమె అన్నారు. అమ్మాయిల దుస్తుల విషయంలో అబ్బాయిల కామెంట్లపై ఆమె మండిపడ్డారు. యూనివర్శిటీలో ఉన్న అమ్మాయిలంతా 18 ఏళ్లకు పైబడినవారేనని... వారికి సొంత నిర్ణయాలను తీసుకునే హక్కు ఉంటుందని చెప్పారు. తాను యూరప్ లో పుట్టానని... యూరప్, కెనడాలను తరచుగా సందర్శిస్తుంటానని... విద్యార్థినుల దుస్తులపై నియంత్రణలు విధిస్తే, తనపై తాను నియంత్రణ విధించుకున్నట్టే అని అన్నారు.