kbc: కేబీసీ 9లో మొదటి కరోడ్పతి... అనామిక మజుందార్!
- రూ. కోటి గెల్చుకున్న స్వచ్ఛంద సేవకురాలు
- రూ. 7 కోట్ల జాక్పాట్ ప్రశ్న వదిలేసుకున్న పార్టిసిపెంట్
- ఇదే ఎపిసోడ్లో పీవీ సింధు
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `కౌన్ బనేగా కరోడ్పతి` సీజన్ 9లో మొదటి కరోడ్పతిగా జంషెడ్పూర్కి చెందిన అనామిక మజుందార్ నిలిచారు. సెప్టెంబర్ 28న షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ఎపిసోడ్ వచ్చే నెల ప్రసారం కానుంది. అనామిక రూ. కోటి గెల్చుకుందని, రూ. 7 కోట్ల జాక్పాట్ ప్రశ్నను వదిలేసుకుందని బాలీవుడ్ మీడియా కథనాలు ఇచ్చింది.
ఆగస్టు 28న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎవరూ రూ. కోటి గెల్చుకోలేదు. `ఫెయిత్ ఇన్ ఇండియా - ఫీమేల్ ఆరా` పేరుతో అనామిక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. తాను గెల్చుకున్న డబ్బును ఈ సంస్థ ద్వారా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తానని ఆమె చెప్పినట్లుగా సమాచారం. అనామిక ఎపిసోడ్లోనే కార్యక్రమానికి అతిథిగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హాజరైనట్లు తెలుస్తోంది.