raj thakarey: బుల్లెట్ రైలును అడ్డుకుంటాం: రాజ్ థాకరే

  • రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను కల్పించండి
  • బుల్లెట్ రైలు కోసం ఒక్క ఇటుకను కూడా పేర్చనీయం 
  • వర్షాలు ఇప్పుడే పడటం లేదు
ముంబైలోని పరేల్ రోడ్, ఎల్ఫిన్ సన్ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెనపై చోటు చేసుకున్న తొక్కిసలాటలో 23 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపి ఈ తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దంటూ మండిపడ్డారు.

ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లలో ముందు సరైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని... ఆ తర్వాతే బుల్లెట్ రైలు గురించి ఆలోచించాలని అన్నారు. అంతవరకు బుల్లెట్ రైలు కోసం ఒక్క ఇటుకను కూడా పేర్చనీయమని హెచ్చరించారు. వర్షాల వల్ల తొక్కిసలాట జరిగిందంటూ రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని... వర్షాలు ఇప్పుడే కొత్తగా రాలేదని రాజ్ థాకరే ఎద్దేవా చేశారు. 
raj thakarey
mns
mumbai
mumbai stampade

More Telugu News