apple: ఐఫోన్ 8ప్లస్ పై కస్టమర్ల అసంతృప్తి.. ఫిర్యాదుల వెల్లువ
- ప్యానెల్ నుంచి వేరవుతున్న స్క్రీన్
- ఉబ్బుతున్న ఫోన్
- ఫిర్యాదుల వెల్లువ
- ఇంతవరకు స్పందించని యాపిల్
యాపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 8ప్లస్ విడుదలై ఇంకా నెల రోజులు కూడా గడవలేదు. అప్పుడే ఈ ఫోన్లపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తైవాన్ కు చెందిన ఓ మహిళ 64 జీబీ ఐఫోన్ 8ప్లస్ ను కొనుగోలు చేసింది. తాను కొన్న ఐదు రోజుల తర్వాత, తాను ఛార్జింగ్ పెట్టిన మూడు నిమిషాల తర్వాత ఫోన్ ఫ్రంట్ ప్యానెల్ కాస్త ఉబ్బిపోయి కనిపించిందని.. ఆ తర్వాత కాసేపటికి ఫోన్ నుంచి విడిపోయిందని కంప్లైంట్ చేసింది.
ఐఫోన్ 8ప్లస్ కొనుగోలు చేసిన మరో వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదే చేశాడు. ఫోన్ బాడీతో స్క్రీన్ వేరయిపోయిందంటూ ఓ జపాన్ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమస్యలన్నీ బ్యాటరీ వల్లే వస్తున్నాయినే ఆరోపణలు వస్తున్నాయి. ఐఫోన్ 8ప్లస్ కు యాంపరెక్స్ టెక్నాలజీస్ తయారు చేసిన బ్యాటరీని వాడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7లో ఈ బ్యాటరీనే వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం క్యూపర్టినీలో ఉన్న హెడ్ క్వార్టర్స్ లో ఈ రిపోర్టులపై యాపిల్ సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. స్క్రీన్ ఉబ్బడం, విడిపోవడంతో పాటు ఇతర సమస్యలపై కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అయితే, ఈ ఫోన్లు కాలిపోయినట్టు మాత్రం ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.