china: డోక్లాం తర్వాత భారత్-చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయ్: చైనా రాయబారి
- ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైంది
- మోదీ, జిన్ పింగ్ లు కొత్త సందేశాన్ని ఇచ్చారు
- డోక్లాం వివాదం గత చరిత్ర
చైనా, భారత్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రాజేసిన డోక్లాం వివాదం ఇప్పుడు గతించిన చరిత్ర అని... ఇప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని భారత్ లో చైనా రాయబారి లూ జిహోయి అన్నారు. డోక్లాం తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని చెప్పారు.
ఈరోజు చైనా రాయబార కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు కొత్త సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, కొత్త సయోధ్యలపై స్పష్టమైన ప్రకటన చేశారని అన్నారు.