north korea: మిస్సైల్స్ ను తరలిస్తున్న ఉత్తర కొరియా.. యుద్ధ సన్నాహాలేనా?
- సనుమ్ డోంగ్ నుంచి క్షిపణుల తరలింపు
- మధ్యంతర లేదా ఖండాంతర క్షిపణులు అయి ఉండవచ్చు
- కొరియన్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ వెల్లడి
రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి కొన్ని క్షిపణులను ఇతర ప్రాంతాలకు ఉత్తర కొరియా తరలిస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ వెల్లడించింది. సనుమ్ డోంగ్ లోని ఉత్తర కొరియా మిస్సైల్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫెసిలిటీ నుంచి ఈ క్షిపణులను రవాణా చేస్తున్నట్టు అమెరికా, దక్షిణ కొరియా అధికారులు గుర్తించారని తెలిపింది. అయితే, వీటిని ఎప్పుడు, ఎక్కడికి తరలించారో మాత్రం వెల్లడించలేదు. ఇవి మధ్యంతర శ్రేణి హసోంగ్-12 లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ హసోంగ్-14 క్షిపణులైనా కావొచ్చని తెలిపింది.