Dalits: బౌద్ధ మతాన్ని స్వీకరించిన 300 మంది దళితులు

  • అశోక విజయ దశమి రోజు దీక్ష
  • వీరిలో 50 మంది మహిళలు
  • అందరూ స్వచ్ఛందంగానే బౌద్ధాన్ని స్వీకరించారన్న నిర్వాహకులు

గుజరాత్‌కు చెందిన 300 మందికిపైగా దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించారు. అశోక విజయ దశమిని పురస్కరించుకుని వీరంతా బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. వీరంతా అహ్మదాబాద్, వడోదరకు చెందినవారు. గుజరాత్ బుద్ధిస్ట్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 200 మంది బౌద్ధ మతాన్ని స్వీకరించగా వీరిలో 50 మంది మహిళలు ఉన్నట్టు ఆర్గనైజేషన్ సెక్రటరీ రమేష్ బేంకర్ తెలిపారు. బుద్ధుడు నిర్యాణం చెందిన కుషినగర్ ప్రాంతానికి చెందిన బౌద్ధ మతపెద్ద ఆధ్వర్యంలో వీరు దీక్ష తీసుకున్నట్టు ఆయన వివరించారు.

ఇక వడోదరలో నిర్వహించిన మరో కార్యక్రమంలో వందమంది దళితులు బౌద్ధాన్ని స్వీకరించారు. పోర్‌బందర్‌కు చెందిన బౌద్ధ సన్యాసి ప్రగ్న రత్నా ఆధ్వర్యంలో వీరు దీక్ష తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం వెనక ప్రత్యేకంగా ఎటువంటి సంస్థల ప్రోద్బలం లేదని కార్యక్రమ నిర్వాహకుడు మధుసూదన్ రోహిత్ తెలిపారు. వారంతా స్వచ్ఛందంగానే మతాన్ని స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News