Sadhus: పవిత్ర గంగానదిలో స్నానం చేసేందుకు సాధువుల నిరాకరణ.. కలుషితమైపోయిందని ఆరోపణ
- సాధువుల ఆరోపణలపై స్పందించిన మేజిస్ట్రేట్
- నీళ్ల నమూనాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశం
గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని చెబుతారు. ఇక సాధుసంతులు అయితే నిత్యం గంగలో మునకేస్తుంటారు. అయితే విజయదశమి రోజున విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని షుకేర్తల్ ప్రాంతంలోని గంగానదిలో స్నానం చేసేందుకు సాధువులు నిరాకరించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున స్నానానికి తరలివచ్చిన సాధువులు నది నీళ్లు కలుషితమైనట్టు గుర్తించారు. దీంతో స్నానం చేసేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నల్లగా మారిపోయాయని, పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని ఆరోపించారు. సాధువుల ఆరోపణలపై స్పందించిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (జన్‌సాథ్) శ్యావద్ చౌహన్ నీళ్ల నమూనాలు సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.