vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' శాటిలైట్ రైట్స్ కి పోటీ తక్కువే!
- చిన్న సినిమాగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' పెద్ద హిట్
- అయినా శాటిలైట్ హక్కుల పరంగా పోటీ లేదు
- అందుకు కారణం ఇంటిల్లిపాది చూసే కంటెంట్ కాకపోవడమే
- మొత్తానికి ఫ్యాన్సీ రేటుకు 'స్టార్ మా' సొంతం చేసుకుంది
సాధారణంగా చిన్న సినిమాలు పెద్ద హిట్ అయితే శాటిలైట్ రైట్స్ కి ఒక రేంజ్ లో పోటీ ఉంటుంది. కానీ 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ, భారీ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను మూడున్నర కోట్లకు తీసుకోవాలని జీ తెలుగు ఛానల్ వారు భావించారు. కానీ ఈ సినిమా కంటెంట్ విషయంలో తర్జన భర్జనలు జరిగాక వెనకడుగు వేశారట.
ఎందుకంటే టీవీలో సినిమా అంటే కుటుంబ సమేతంగా అంతా కలిసి చూస్తారు. ఈ సినిమా కంటెంట్ అందుకు దూరంగా ఉండటంతో, వాళ్లు వెనకడుగు వేశారు. దాంతో 'స్టార్ మా' టీవీ వారు ముందుకొచ్చారట. జీ తెలుగు ఇస్తామని చెప్పిన రేటుకే శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నారని అంటున్నారు. టీవీలో ప్రసారం చేసేందుకు వీలుగా కొన్ని సన్నివేశాలను తొలగించి .. కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తారట.