rohit sharma: టాప్ 5 బ్యాట్స్మెన్లలో స్థానం సంపాదించుకున్న రోహిత్ శర్మ
- కెరీర్లో ఉత్తమ ర్యాంకింగ్
- వన్డే ర్యాంకింగ్‌లు విడుదల చేసిన ఐసీసీ
- మొదటి స్థానంలో కొనసాగుతున్న విరాట్
ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగుల్లో రోహిత్ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ 5లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ చేసిన అత్యధిక స్కోర్ అతని ర్యాంకింగ్ మెరుగుదలకు కారణమైంది. అతని కెరీర్లో సంపాదించుకున్న ఉత్తమ ర్యాంక్ ఇది. 790 ర్యాంకింగ్ పాయింట్లతో టాప్ 5లో నిలిచిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.
ఇక మొదటి స్థానంలో ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. కేవలం 12 పాయింట్ల తేడాతో డేవిడ్ వార్నర్ రెండోస్థానంలో నిలిచాడు. ఏబీ డివిలియర్స్, జోయీ రూట్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇంకా స్థానాలు మెరుగుపరుచుకున్న భారత బ్యాట్స్మెన్లలో అజింక్యా రహానే, కేదార్ జాదవ్‌లు ఉన్నారు. నాలుగు స్థానాలు ముందుకు వచ్చి రహానే 24వ స్థానంలో ఉండగా, 8 స్థానాలు మెరుగుపరుచుకుని జాదవ్ 36వ ర్యాంకులో నిలిచారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ అక్షర పటేల్ ఏడో ర్యాంకు సాధించాడు. మొదటి స్థానంలో పాకిస్థాన్ లో జన్మించిన సౌతాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు.