rahul: రాహుల్ అమేథీకి రావచ్చు: యూపీ సర్కార్
- ఈ నెల 4న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ పర్యటన
- రాహుల్ అమేథీకి రావద్దని ఇటీవలే చెప్పిన యూపీ అధికారులు
- భద్రత కల్పిస్తామని తాజాగా మరో ప్రకటన
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 4న ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజక వర్గమైన అమేథీకి రావాలని అనుకోగా, ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని, భద్రత కల్పించలేమని అక్కడి అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై వెనక్కితగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. రాహుల్ గాంధీ అమేథీకి రావచ్చని చెప్పింది. రాహుల్‌కి తగిన భద్రత కల్పిస్తామని కూడా తెలిపింది. రాహుల్ గాంధీ పర్యటనపై తాము ఎప్పుడూ నిషేధం విధించలేదని పేర్కొంది. కేవలం పరిస్థితులను అర్థం చేసుకోవాలని మాత్రమే ఆయనను తాము కోరామని తెలిపింది.
తమ ప్రాంతం నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఎన్నికల తరువాత మళ్లీ తమ ప్రాంతానికి రాలేదని అమేథీ ప్రజలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. రాహుల్ కనిపించడం లేదని ఆ ప్రాంతంలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆ ప్రాంతానికి రానున్నారు.