america: అమెరికన్ శాస్త్రవేత్తలకు 2017 వైద్యశాస్త్రం నోబెల్... ప్రకటించిన నోబెల్ కమిటీ
- జెఫ్రీ హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ యంగ్లకు నోబెల్
- జీవన గడియారం (బయోలాజికల్ క్లాక్)పై పరిశోధన
- వివరాలను ట్విట్టర్లో పంచుకున్న నోబెల్ కమిటీ
అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జెఫ్రీ హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ యంగ్లు ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో 2017 నోబెల్ బహుమతిని గెల్చుకున్నారు. జీవన గడియారంను నియంత్రించే అణు సంబంధ క్రియా విధానాలపై వారు చేసిన పరిశోధనకు గాను ఈ అవార్డు అందజేస్తున్నట్లు స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన నోబెల్ కమిటీ ప్రకటించింది.
వారి పరిశోధనల ఆధారంగా భూపరిభ్రమణంతో మొక్కలు, జంతువులు, మనుషుల జీవన గడియారం ఎలా కలిసిపోతాయనే విషయం తెలిసిందని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది. వారికి 9 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లను (1.1 మిలియన్ డాలర్లు) బహుమతిగా ఇవ్వనున్నారు. నోబెల్ అసెంబ్లీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా నోబెల్ కమిటీ పంచుకుంటూనే ఉంది. వారికి అవార్డు ప్రకటిస్తున్న వీడియోను కూడా నోబెల్ కమిటీ షేర్ చేసింది.