pak fears: తమపై భారత్‌ నిఘా పెడుతోందని భయపడుతోన్న పాక్... 44 మిలియన్‌ డాలర్లతో కొత్త ప్రాజెక్టు

  • ఫోన్‌, ఈ-మెయిల్‌ సందేశాల వివరాలను భారత్ తస్కరిస్తోందని అనుమానం
  • 135 కిలోమీటర్ల పొడవైన ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను వేయాలని నిర్ణయం
  • చైనా, పాక్‌ ఎకనమిక్‌ కారిడార్ (సీపెక్‌) లో భాగంగా కొత్త ప్రాజెక్ట్

తమ దేశంలో ఫోన్‌, ఈ-మెయిల్‌ సందేశాల వివరాలను భారత్ తస్కరిస్తోందని అనుమానపడుతూ పాకిస్థాన్ వణికిపోతోంది. భారత్ చేతికి ఆ సమాచారం అందకుండా ఉండేందుకు సుమారు రూ.288 కోట్లు (44 మిలియన్‌ డాలర్లు) ఖర్చు చేసి 135 కిలోమీటర్ల పొడవైన ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను వేయాలని యోచిస్తోంది. చైనా, పాక్‌ ఎకనమిక్‌ కారిడార్ (సీపెక్‌) ను నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును కూడా చేపట్టాలని భావిస్తోంది.

భార‌త్‌కు చెందిన కంపెనీలు పాకిస్థాన్‌కు ఇంటర్నెట్‌ అందించే సర్వీస్‌ ప్రొవైడర్లుగా ఉన్నాయి. దీంతో పాక్ భ‌య‌ప‌డుతోంది. చైనాకు కేబుల్‌ వేయడం వల్ల త‌మ‌ భద్రతకు ఏ మాత్రం విఘాతం కలగదని పాక్ అనుకుంటోంది.  

  • Loading...

More Telugu News