Maharashtra Navnirman Sena: గాంధీ జయంతినాడు మోదీపై కార్టూన్‌తో విరుచుకుపడిన రాజ్‌థాక్రే

  • గాంధీ, మోదీ కార్టూన్‌ పోస్ట్ చేసిన ఎంఎన్ఎస్ చీఫ్
  • గతంలోనూ పలు కార్టూన్లు గీసిన వైనం
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ప్రధాని మోదీపై వినూత్నంగా విరుచుకుపడ్డారు. గాంధీ, మోదీ కార్టూన్‌ గీసిన థాక్రే దానికి ‘ఇద్దరిదీ ఒకటే గడ్డ’ (టు ఆఫ్ ది సేమ్ సోయిల్) అనే హెడ్డింగ్ పెట్టారు. కార్టూన్‌లోని గాంధీ తన జీవిత చరిత్ర ‘మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్’ అనే పుస్తకాన్ని పట్టుకుని నిలబడగా, మోదీ ‘మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ లైస్’ అనే పుస్తకాన్ని పట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడీ కార్టూన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కార్టూన్ల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడం రాజ్ థాక్రేకు కొత్తకాదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పుడు, నోట్ల రద్దు, పెట్రోలు ధరల పెరుగుదల సమయంలోనూ కార్టూన్లు వేశారు.  శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కూడా మంచి కార్టూనిస్టే. 1947లో ఆయన ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఆయన సహచరుడు కావడం గమనార్హం.
Maharashtra Navnirman Sena
Raj Thackeray
Mahatma Gandhi
modi

More Telugu News