samanta: వివాహం తరువాత బాలీవుడ్ మూవీ చేయనున్న సమంత!
- పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తానన్న సమంత
- ఆమె మాటలను సమర్థించిన చైతూ
- అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాగ్
- బాలీవుడ్ లోను సమంత అడుగుపెట్టనుంది
మరో రెండు రోజుల్లో నాగ చైతన్య .. సమంత వివాహం జరగనుంది. పెళ్లి తరువాత సమంత సినిమాలు చేస్తుందా? అనే సందేహాన్ని కొన్ని రోజుల క్రితమే అభిమానులు వ్యక్తం చేశారు. అయితే తాను నటనను కొనసాగిస్తాననీ .. చైతూ కూడా అందుకు అడ్డు చెప్పడని ఆమె అప్పుడే చెప్పింది. చైతూ కూడా సమంత ఇష్ట ప్రకారమే జరుగుతుందనీ, అందుకు తన తండ్రి వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పాడు.
ఇక తాజా ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, వివాహం తరువాత కూడా సమంత ఎప్పటిలానే సినిమాలు చేస్తూ వెళుతుందని అన్నారు. టాలీవుడ్ .. కోలీవుడ్ సినిమాలు చేయడం మాత్రమే కాదు, బాలీవుడ్ లోను అడుగుపెట్టనుందని చెప్పారు. అయితే బాలీవుడ్ లో ఆమె ఎవరి దర్శకత్వంలో .. ఏ హీరో సరసన చేయనుందనే విషయాన్ని నాగ్ సస్పెన్స్ లోనే ఉంచేశారు. బాలీవుడ్ లో రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్స్ లో ఆమె నటించనుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.