accident: భారత్ అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఎలా జరిగి ఉంటుంది?

  • ప్రమాదానికి గురైన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర
  • ప్రపంచంలోనే కీలకమైన సబ్ మెరైన్లలో ఒకటి ఐఎన్ఎస్ చక్ర
  • దీని బలం, బలహీనత స్టెల్త్ టెక్నాలజీ 
  • సముద్రంతో పాటు, భూమిపై లక్ష్యాలు ఛేదించడంలో ఇది దిట్ట

భారత్‌ కు చెందిన కీలక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియకపోవడం విశేషం. సముద్రంలో ఏదైనా నౌకను ఢీకొనడం వల్లగానీ, లేకపోతే విశాఖలోని షిప్‌ యార్డ్‌ లోకి ప్రవేశించే సమయంలో తుక్కును ఢీకొనడం వల్లగానీ ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం విశేషం. 2012లో సుమారు బిలియన్‌ డాలర్ల ఒప్పందం మేరకు రష్యా నుంచి ఐఎన్‌ఎస్‌ చక్రను భారత్ లీజుకు తీసుకుంది.

ఈ సబ్‌ మెరైన్‌ సుమారు 12వేల టన్నుల బరువు, 190 మెగావాట్ల అణు రియాక్టర్‌ ను కలిగి ఉంది. అత్యధికంగా గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 80 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఇందులో వ్యూహాత్మక క్షిపణులు, అగ్నిమాపక వ్యవస్థ, సోనార్‌ వ్యవస్థ, అత్యాధునిక పెరిస్కోప్‌ ఉన్నాయి. ఇది రష్యాలో విధులు నిర్వర్తించిన సమయంలో ‘ది నెప్రా’ పేరుతో పిలిచేవారు. సోవియట్‌ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఇది మూలనపడింది. అయితే రక్షణ అవసరాల నేపథ్యంలో దీనిని భారత్ లీజుకి తీసుకుంది. 2022 వరకు ఇది భారత రక్షణ అవసరాలు తీరుస్తుంది.

 ఈ ప్రమాదంలో దీని ముందు భాగంలోని టార్పెడో ట్యూబ్‌ కింద ఉండే సోనార్‌ డోమ్‌ దెబ్బతిందని తెలుస్తోంది. దీనిని టైటానియం అనే కఠినమైన లోహంతో తయారు చేస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలాంతర్గామిని తయారు చేసిన డాక్ లోనే దీనికి మరమ్మతులు నిర్వహించనున్నారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు, నిపుణులు కావాల్సి ఉంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సబ్ మెరీన్లలో ఇది కూడా ఒకటి. దీని బలం, బలహీనత స్టెల్త్ టెక్నాలజీ (రహస్యంగా ప్రయాణించడం) కావడం విశేషం. ఇది శత్రువుకు చిక్కకుండా ప్రయాణిస్తుంది. దీంతో ఇది ప్రయాణించే మార్గంలో ఇతర నౌకలు వచ్చి, ప్రమాదానికి గురవుతుంటాయి. ఇది సముద్రంతో పాటు నేలపై లక్ష్యాలను కూడా కచ్చితంగా ఛేదించగలగడం విశేషం. 

  • Loading...

More Telugu News