spaider: ఓవర్సీస్ కలెక్షన్ కింగ్... టాలీవుడ్ ప్రిన్సే!
- ఓవర్సీస్ లో కలెక్షన్ కింగ్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు
- 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటిన నాలుగు సినిమాలు
- మహేష్ బాబు తరువాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్
దసరాకు విడుదలైన 'స్పైడర్' తెలుగులో అంచనాలు అందుకోనప్పటికీ తమిళంలో మాత్రం సత్తాచాటింది. తమిళంతో పాటు ఓవర్సీస్ లో మహేష్ ట్రాక్ రికార్డును మరింత పదిలం చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లలో మహేష్ బాబుది విభిన్నమైన ఇమేజ్. దీంతో మొత్తం నాలుగు 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ సినిమాలతో ప్రిన్స్ మహేష్ బాబు ఓవర్సీస్ రికార్డు క్రియేట్ చేశాడు.
బాహుబలి తరువాత అత్యధిక ధియేటర్లలో విడుదలైన 'స్పైడర్' సినిమా తొలి వారాంతానికి 1. 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ లో 2.89 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో మహేష్ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా 'శ్రీమంతుడు' నిలవగా, దాని తరువాతి స్థానంలో మహేశ్-వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 1.64 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఆ తరువాత 'దూకుడు' సినిమా 1.56 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలించింది. నాలుగో స్థానంలో 'స్పైడర్' నిలిచింది.
దీంతో ఓవర్సీస్ కలెక్షన్ కింగ్...ప్రిన్స్ మహేష్ బాబేనని సినీ ప్రేమికులు చెబుతున్నారు. అతని తరువాతి స్థానంలో 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ' సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని కలెక్షన్లు చెబుతున్నాయి.