brahmanandam: అమెరికాలో సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్.. బ్రహ్మానందంకు ఘన సన్మానం!
- 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అతిథిగా బ్రహ్మానందం
- కార్యక్రమంలో పాల్గొన్న నాట్స్ సియోటెల్, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్
- బ్రహ్మానందంపై ప్రశంసల జల్లు
అమెరికాలోని సియాటెల్ నగరంలో తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. ఇదే వేదికపై యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం సరైందని నిర్వాహకులు అన్నారు. నాట్స్ సియోటెల్, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్, అక్కడ ఉన్న తెలుగు వాళ్లు ఎంతగానో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
నటుడు నాని నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత మంచు విష్ణు నటిస్తోన్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రానికి అమెరికాలో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాకు ఈ వార్త తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడి పెదవులపై చెరగని చిరు నవ్వు మన బ్రహ్మానందం అని, ఆయన మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలకు అందుకోవాలని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.