sam: పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయిన సమంత.. క్రిస్టియన్ సంప్రదాయంలో నాగచైతన్య- సమంత వివాహం.. ఫొటోలు
- సమంత, నాగచైతన్యతో ప్రముఖుల ఫొటోలు
- పెళ్లిదుస్తుల్లో మెరిసిపోతోన్న సమంత
- ఉంగరాలు మార్చుకున్న సమంత, చైతూ
నిన్న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు సమంత, చైతూకి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. సమంత, నాగచైతన్యల పెళ్లికి హాజరవుతోన్న వారు వారిద్దరితో ఫొటోలు దిగి తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.
పెళ్లి దుస్తుల్లో సమంత మెరిసిపోతోంది. చిరునవ్వులు చిందిస్తూ హుషారుగా కనపడుతోంది. సమంత, చైతూ ఉంగరాలు మార్చుకున్న ఫొటోలను నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.