balakrishna: బౌన్సర్లను నియమించుకునే ఆలోచనలో బాలకృష్ణ!
- తరచూ అభిమానులపై చేయి చేసుకుంటోన్న బాలకృష్ణ
- సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు
- ఇకపై అలా జరగకూడదని భావిస్తోన్న బాలయ్య
ఇటీవల కాలంలో బాలకృష్ణ తన అభిమానులపై వరుసగా చేయి చేసుకుంటూ వస్తోన్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అభిమానంతో దగ్గరికి వచ్చినవారి పట్ల ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక తాను ఎవరిపై చేయిచేసుకోవద్దనే నిర్ణయానికి బాలకృష్ణ వచ్చాడని అంటున్నారు.
తాను అభిమానులకి దగ్గరగా ఉండాలనీ .. వాళ్లతో కలిసిపోవాలని అనుకున్నానని సన్నిహితులతో చెప్పారట. ఈ కారణంగానే తాను బౌన్సర్లను దూరం పెట్టాననీ, అయితే కొంతమంది అభిమానులు తనపైకి దూసుకొస్తూ అసహనానికి గురిచేస్తున్నా రంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు తొక్కుతూ .. నెట్టేస్తూ కోపాన్ని తెప్పిస్తున్నారనీ, ఆ సమయంలో ఒక దెబ్బ కొట్టడం వలన గోరంతలు కొండంతలు అవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇక తాను బౌన్సర్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నానని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.