ali: పవన్ పిలవలేదు .. అవసరం అనిపించినప్పుడు చెబుతానన్నారు!: అలీ

  • పవన్ తో చాలా కాలంగా అలీ స్నేహం
  • ఆయన కాంబినేషన్లో పలు సినిమాలు
  • రాజకీయాల గురించి నాతో పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు
  • పవన్ చేస్తున్నది ఒంటరి పోరాటం  

పవన్ కల్యాణ్ కి .. అలీకి మధ్య ఎంతో సాన్నిహిత్యం వుంది. పవన్ సాధ్యమైనంత వరకూ తన సినిమాల్లో అలీ ఉండేలా చూసుకుంటూ వుంటారు. అలా పవన్ తో అలీ చేసిన సినిమాలు చాలానే వున్నాయి. అయితే పవన్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కనిపించకపోవడానికి కారణమేంటనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో అలీకి ఎదురైంది.

 అందుకు ఆయన స్పందిస్తూ .. పవన్ తో తనకి గల స్నేహం గురించి చెప్పాడు. సరదా కబుర్లు మాత్రమే తప్ప, తమ మధ్య ఎప్పుడూ రాజకీయాల ప్రస్తావన రాదని అన్నాడు. తాను పార్టీ పెడుతున్నాననీ .. మీరంతా వచ్చి హెల్ప్ చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదని చెప్పాడు. రాజకీయాల్లోకి అడుగుపెడితే .. తనని సపోర్ట్ చేసిన వారు సైతం తిట్లను .. బెదిరింపులను ఎదుర్కోవలసి వస్తుందనీ, అది తనకి మరింత బాధ కలిగిస్తుందని ఆయన చెప్పారని అన్నాడు. మంచైనా .. చెడైనా తానే ఎదుర్కొంటాననీ, అవసరం అనిపించినప్పుడు చెబుతానని పవన్ అన్నారని చెప్పాడు. పవన్ చేస్తున్నది ఒంటరిపోరాటమని స్పష్టం చేశాడు.         

ali
  • Loading...

More Telugu News