stirrer: కూర కలయబెట్టడానికి కూడా ఓ యాప్‌... రూపొందించిన స్విస్ కంపెనీ

  • స్మార్ట్‌గా వంట చేసుకునే స‌దుపాయం
  • ఒకే గిన్నెలో అన్ని ర‌కాల వంట‌లు
  • అన్నీ యాప్ ద్వారానే నియంత్ర‌ణ‌

స‌మ‌యం క‌న్నా వేగంగా ప‌రిగెత్తాల‌నే ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌త‌వుతున్న నేటి మనుషులకు వంట విష‌యానికి వ‌చ్చేస‌రికి నెమ్మ‌దించ‌క త‌ప్ప‌డం లేదు. ఇక ఆ అవ‌స‌రం కూడా లేకుండా ఉండేందుకు స్విట్జ‌ర్లాండ్‌కి చెందిన వంట పాత్ర‌ల త‌యారీ కంపెనీ కిక్ స్టార్ట‌ర్, ఓ పాత్ర‌ను త‌యారు చేసింది. ఈ పాత్ర‌లో వంట‌కాన్ని మాటిమాటికి క‌ల‌యబెట్టాల్సిన అవ‌స‌రం లేదు.

తీరిగ్గా టీవీ చూస్తూ, గిన్నె మూత తీయ‌కుండా పాత్ర‌కు అనుబంధంగా వ‌చ్చిన ప్ర‌త్యేక‌మైన యాప్ ద్వారా క‌ల‌యబెట్టొచ్చు. అంతేకాదు... ఇందులో వేపుళ్లు, ఫ్రైలు, ఉడ‌క‌బెట్ట‌డాలు ఇలా అన్ని ర‌కాల వంట‌లు చేసుకోవ‌చ్చు. ఇవ‌న్నీ కూడా యాప్ ద్వారానే. `మాస్ట‌ర్‌సోస్‌` అని పిలిచే ఈ వంట‌పాత్ర‌ను ఎక్క‌డి నుంచైనా నియంత్రించ‌వ‌చ్చు. త్వ‌ర‌లో దీన్ని మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.
 

  • Loading...

More Telugu News