anantapuram: అనంతపురంలో దశాబ్దకాలంలో ఎన్నడూ కురవనంత వర్షం!

  • రాత్రి 3 గంటల నుంచి కుంభవృష్టి 
  • సరిగ్గా 3 గంటల పాటు ఎడతెగని వర్షం
  • 3 గంటల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లా కనీవినీ ఎరుగని వర్షాన్ని చవిచూసింది. నిన్న సాయంత్రం చిన్నగా మొదలైన వర్షం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కుంభవృష్టిగా మారింది. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. కేవలం మూడు గంటల్లోనే 12 సెంటీ మీటర్ల వాన కురవడం విశేషం.

గత దశాబ్దకాలంలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని స్థానికులు ఆశ్చర్యంతో చెప్పారు. దీంతో అనంతపురం జిల్లాలోని చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెన్నా నది ధాటిగా ప్రవహిస్తోంది. పైన తెలిపిన మండలాల్లో కాలనీలు నీటమునిగాయి. మోకాలిలోతు నీటిలో ఆయా ఊర్లు జలదిగ్బంధనమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 

  • Loading...

More Telugu News