Roswell: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏలియన్ ను పట్టుకున్న నాటి వీడియో...మీరు కూడా చూడండి
- గ్రహాంతర వాసులపై ఊహాగానాలు
- 1947లో పేలిన ఫ్లయింగ్ సాసర్
- గాయపడిన ఏలియన్
- ఏలియన్ ను స్ట్రెచర్ పై తీసుకెళ్తున్న బలగాలు
గ్రహాంతర వాసులపై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. గ్రహాంతరవాసుల ధీమ్ తో వచ్చిన ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పటికీ ఏలియన్ ను చూసినవారు ఎవరైనా ఉన్నారా? అన్నదానికి స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. తాజాగా ఏలియన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947లో అమెరికా, మెక్సికోలోని రోస్ వెల్ ప్రాంతానికి సమీపంలోని 'ఏరియా 51' అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా బలగాలు చెప్పాయి.
అయితే, కొందరు మాత్రం ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అది ఏలియన్ ల అంతరిక్ష నౌక అని తెలిపారు. మరోవైపు రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్ గా ఏర్పాటు చేసిన ప్రయోగంలో ఆ బెలూన్ పేలిపోయిందని మరికొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల సంగతి ఎలా ఉన్నా, అప్పటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సందర్భంగా అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు స్ట్రెచర్ పై ఏలియన్ ను స్వయంగా తరలించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. స్పేస్ షిప్ పేలిపోవడంతో ఏలియన్ గాయపడిందని, దానిని స్వయంగా సైనికులు స్ట్రెచర్ పై తరలించారని వీడియో చూసిన వారికి అర్ధమవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.