amaravati: స్వల్ప భూకంపంతో ఉలిక్కిపడ్డ అమరావతి!

  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 1 గా నమోదు 
  • రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకూ ప్రకంపనలు
  • రోడ్లపైనే గడిపిన ప్రజలు

ఈ తెల్లవారుఝామున కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. తొలుత రాత్రి 10.15 గంటల సమయంలో ఆపై తెల్లవారుఝామున భూ ప్రకంపనలు నమోదు కాగా, భూకంపం భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన పలు గ్రామాల్లోని ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపారు.

గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్‌ పురం, దుర్గాపురం, ముస్తాబాద్, తుళ్లూరు, పెదకాకాని తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని ప్రజలు వెల్లడించారు. ముఖ్యంగా అపార్టుమెంట్ లలో నివసిస్తున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. కాగా, ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై ఒక పాయింట్ మాత్రమేనని, వీటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలుండవని అధికారులు వెల్లడించారు. 2015 తరువాత ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడం ఇదే తొలిసారని ప్రజలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News