Juhi Chawla: చిన్న పొరపాటుతో చీవాట్లు తింటున్న బాలీవుడ్ నటి జుహీ చావ్లా!
- బాణసంచా నిషేధాన్ని హర్షిస్తూ ట్వీటిన బాలీవుడ్ నటి
- సుప్రీంకోర్టుకు బదులు ఢిల్లీ సుప్రీంకోర్టు అని ట్వీట్
- రకరకాలుగా నెటిజన్ల విమర్శలు
దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియిన్ (ఎన్సీఆర్) పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంపై బాలీవుడ్ నటి జుహీ చావ్లా స్పందించింది. కోర్టు తీర్పును హర్షిస్తున్నట్టు పేర్కొంది. అయితే ట్వీట్లో చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు ఆమెను అభాసుపాలు చేసింది. ‘‘ఢిల్లీ సుప్రీం కోర్టు బహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నవంబరు 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం ఉండాల్సిందే. ఈ దీపావళిని ప్రేమ, ఆప్యాయతలతో జరుపుకోండి’’ అని ట్వీట్ చేసింది.
జుహీ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె ట్వీట్‌ను సమర్థిస్తూనే ఢిల్లీ సుప్రీంకోర్టు ఏంటి తల్లీ? అని ప్రశ్నిస్తున్నారు. అది జుహీ సుప్రీంకోర్టు ఆదేశమని మరి కొందరు ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఓ సుప్రీంకోర్టు ఉందని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. మరొకరైతే జుహీని హిందూ విరోధిగా పేర్కొంటూ అది ఢిల్లీ సుప్రీంకోర్టు కాదని, భారత సుప్రీంకోర్టు అని చీవాట్లు పెట్టాడు. ఇంకా ఎవరెవరు ఏమేమి అన్నారో మీరూ చూడండి.