gurmeet singh: డేరాబాబా పీఏ, న్యాయసలహాదారును తనిఖీ చేసి షాక్ కు గురైన సీబీఐ అధికారులు!
- 400 మందిని నపుంసకులుగా మార్చిన డేరా బాబా
- డేరాబాబా అనుచరుడు హంసరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు
- జైలులోనే సమగ్ర దర్యాప్తు
డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన దారుణాలపై ఫిర్యాదులందుతున్నాయి. స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, పురుషులను నపుంసకులుగా మార్చిన సంగతి తెలిసిందే. సుమారు 400 మంది అనుచరులను నపుంసకులుగా మార్చాడని ఫిర్యాదులందాయని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు జైలులోనే విచారణ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
నపుంసకుడిగా మారిన డేరాబాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. డేరాలోని డాక్టర్లే బాబా అనుచరులకు ఈ శస్త్రచికిత్సలు చేశారని గుర్తించారు. దీనిపై గతంలో దర్యాప్తు చేయాలని సీబీఐని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డేరాబాబా పీఏ రాకేష్, న్యాయసలహాదారు దాస్ లకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ వృషణాలు లేవని తేలింది. దీంతో దీనిని మరింత సీరియస్ గా తీసుకున్న సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టింది.