Hyderabad: ఆ దొంగలు అవంతి సామ్రాజ్యం నుంచి వారసత్వంగా వస్తున్నారట!

  • అవంతి సామ్రాజ్యం కాలం నుంచి దొంగతనాలే జీవనాధారం
  • దాహోడ్ జిల్లాలోని గిరిజన తెగకు చెందిన దొంగలు
  • దసరా సందర్భంగా హైదరాబాదులో చోరీలు

బాహుబలి సినిమాలోని అవంతి సామ్రాజ్యం గుర్తుందా? ఆ సామ్రాజ్యంలోని ఓ ప్రాంతమే మాహిష్మతి. ప్రస్తుత మధ్యప్రదేశ్‌ లోని నర్మద నది ఒడ్డున ఉండే ఈ ప్రాంతం నేపథ్యంలోనే బాహుబలి సినిమా సాగింది. దసరా సందర్భంగా హైదరాబాదులో చోటు చేసుకున్న వరుస చోరీలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అవంతి సామ్రాజ్యం కాలంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాల వారసులే నేటి చోరీలో నిందితులని గుర్తించారు. ఈ ముఠా గుజరాత్‌ లోని దాహోడ్‌ జిల్లాకు చెందిన గిరిజన తెగ సభ్యులని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిని పట్టుకునేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ ముఠాలో సాధారణంగా ఐదారుగురు సభ్యులుంటారు. వారంతా ఎంచుకున్న మెట్రో నగరాలకు రైళ్లలో వస్తారు.

ఆయా నగరాల శివారు ప్రాంతాల్లో 10-15 రోజులపాటు మకాం వేస్తారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు, తుప్పల్లోనే పగటి పూట తలదాచుకుంటారు. ఆ సమయంలో అవసరమైతే కొందరు సభ్యులు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్ల గురించి ఆరా తీసి రెక్కీ నిర్వహిస్తారు. చీకటి పడ్డాక అక్కడికి వెళ్లి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తారు. అలా కొన్ని రోజులపాటు చోరీలు చేసి, సంపాదించిన సొత్తుతో వెళ్లిపోతారు.

వీరు చోరీలకు వెళ్లే సమయంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే వినియోగిస్తారు. దాహోడ్‌ ప్రాంతంలోని దాదాపు 20 గ్రామాల్లో ఈ దొంగల ముఠాలున్నాయి. పేదరికం ఆనవాళ్లు ఎక్కువగా కనిపించే వీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దొంగతనాలను వారసత్వంగా చేసుకుని బతికేస్తున్నారు. వీరు ఏడాదంతా కేవలం రెండు జతల దుస్తులతో గడిపేయడం విశేషం. 

  • Loading...

More Telugu News