america: నా పోస్టుకి వెయ్యి షేర్లు వస్తే లొంగిపోతాను: పోలీసులకు నేరగాడి బంపర్ ఆఫర్

  • రెడ్ ఫోర్డ్ టౌన్ షిప్ పోలీస్ స్టేషన్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఛాంపిగ్నే టోరిన్
  • పోస్టు పెట్టిన గంటలోనే వెయ్యి షేర్లు వచ్చేలా చేసిన పోలీసులు
  • ఇచ్చినమాట ప్రకారం లొంగిపోయిన టోరిన్
తన ఫేస్ బుక్ పోస్టుకు వెయ్యి షేర్లు వస్తే లొంగిపోతానని పోలీసులకు చిత్రమైన బంపర్ ఆఫర్ ఇచ్చాడో నేరగాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని మిచిగాన్‌ కు చెందిన రెడ్‌ ఫోర్డ్‌ టౌన్‌ షిప్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఛాంపిగ్నే టోరినో అనే వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తోంది. తప్పించుకు తిరుగుతున్న టోరినో సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులకు వెయ్యి షేర్లు వస్తే స్వయంగా వచ్చి లొంగిపోతానని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

అంతే కాకుండా డజన్ డఫ్ నట్స్ కూడా బహుమతిగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో అతని ఫేస్ బుక్ పోస్టుపై నిఘా వేసిన పోలీసులు, అతను పోస్టు పెట్టిన గంటలోపే వెయ్యి షేర్లు వచ్చేలా చేశారు. దీంతో మాటమీద నిలబడ్డ టోరినో స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 
america
Michigan
criminal
red fort town ship
police

More Telugu News