rahul gandhi: పొట్టి దుస్తుల్లో అమ్మాయిలను చూడాలని ఉంటే హాకీ ఆటకు వెళ్లు: రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన ఆర్ఎస్ఎస్

  • ఆర్ఎస్ఎస్ లో మహిళలకు ప్రాతినిధ్యం ఏది?
  • షార్ట్ వేసుకున్న మహిళ ఒక్కరన్నా ఉన్నారా?
  • రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
  • మండిపడ్డ ఆర్ఎస్ఎస్

ఆర్ఎస్ఎస్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, ఒక్కరన్నా షార్ట్ వేసుకున్న అమ్మాయిలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కనిపించలేదని, రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై ఆర్ఎస్ఎస్ మండిపడింది. రాహుల్ గాంధీ, యాపిల్స్ ను నారింజపళ్లతో పోల్చుతున్నారని, తప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారని ఆరోపించిన ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య, ఆయన పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను చూడాలని అనుకుంటే కనుక అమ్మాయిలు ఆడే హాకీ చూసేందుకు వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఆయన తనకు ప్రసంగాలు రాసిచ్చే వారిగా మరింత తెలివైన వారిని నియమించుకోవాలని సలహా ఇచ్చారు.

రెండు రోజుల క్రితం రాహుల్ మాట్లాడుతూ, "ఆర్ఎస్ఎస్ లో ఎంత మంది మహిళలు ఉన్నారు? ఆర్ఎస్ఎస్ లో షార్ట్స్ వేసుకున్న మహిళలను మీరు ఎప్పుడైనా చూశారా? నేను ఎప్పుడూ చూడలేదు. కానీ కాంగ్రెస్ లో ఆది నుంచి మహిళలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో మాత్రం ఎన్నడూ కనిపించలేదు. ఆర్ఎస్ఎస్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఏంటన్న విషయం, మహిళలు ఏ తప్పు చేశారన్న విషయం దేవుడికే తెలియాలి" అని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం స్పందిస్తూ, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని రుజువైందని, రాహుల్ మాటలు అభ్యంతరకరమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News