face book: 'నీ తమ్ముడి ముందే నిన్ను రేప్ చేసి చంపేస్తా'నంటూ ఫేస్ బుక్ లో యువతికి బెదిరింపులు...అరెస్టు
- అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫేస్ బుక్ లో పోస్టుపెట్టిన యువతి
- తమ్ముడిని ట్యాగ్ చేయడంతో అపరిచితుడి కామెంట్
- దానిని తొలగించిన యువతికి దారుణమైన బెదిరింపులు
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఏ స్థాయిలో దుర్వినియోగమవుతోందో తెలిపే ఘటన కోల్ కతా వేదికగా చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఓ యువతి (20) తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. దానిని తన తమ్ముడికి ట్యాగ్ చేసింది. దీంతో ఆ పోస్టు ఆమె తమ్ముడి ఖాతాలోని స్నేహితులకు కూడా వెళ్లింది.
దీంతో కోల్ కతాకు చెందిన అగ్నీశ్వర్ చక్రవర్తి దానికి ఓ కామెంట్ పెట్టాడు. 'అపరిచితుడు పెట్టిన కామెంట్' అంటూ ఆమె దానిని తొలగించింది. దీంతో అగ్నీశ్వర్ చక్రవర్తి ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మరోసారి వారి అకౌంట్ లో అగ్నీశ్వర్ కామెంట్ చేస్తూ... ఆమెను ఉద్దేశించి 'నా కాళ్లమీద పడి నువ్వు ప్రాధేయపడినా... క్షమించు అని వేడుకున్నా... నీ తమ్ముడి కళ్లముందే నిన్ను రేప్ చేసి చంపేస్తాను' అంటూ బండబూతులతో బెదిరింపులకు దిగాడు.
దీనిపై కోల్ కతాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ అగ్నీశ్వర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పోస్టును చూసిన పోలీసులు, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని, అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.