third world war: అమెరికన్లలో ఇప్పుడున్న అతిపెద్ద భయం ఇదే!

  • థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో!
  • ట్రంప్ తొందరపాటు ధోరణికి తోడైన ఉత్తర కొరియా
  • పౌరుల భయం ఇదేనన్న వాప్ మేన్ వర్శిటీ
  • మీడియాపై ధ్వజమెత్తిన ట్రంప్

అమెరికన్లలో ఇప్పుడున్న అతిపెద్ద భయం ఏంటో తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని వారు ఎన్నడూ లేనంతగా భయపడుతున్నారు. 'సర్వే ఆఫ్ అమెరికన్ ఫియర్స్ 2017'లో భాగంగా వాప్ మేన్ వర్శిటీ ఓ సర్వేను నిర్వహించగా, తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొందరపాటు ధోరణి, ఉత్తర కొరియాతో తరచూ గొడవలు జరుగుతూ ఉండటం తదితర కారణాలతో థర్డ్ వరల్డ్ వార్ రావచ్చని ప్రజలు భయపడుతున్నట్టు తేలింది. ఎక్కువ మంది దేశపౌరుల్లో ఉన్న భయం ఇదేనని సర్వే అనంతరం వాప్ మేన్ వర్శిటీ పేర్కొంది.

ఇదిలావుండగా, తాను తెచ్చిన అణు విధానాలపై అమెరికన్ న్యూస్ ఏజన్సీలు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ ధ్వజమెత్తారు. ఎన్బీసీ న్యూస్ తదితరాలపై విరుచుకుపడుతూ, వాటి అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఎన్బీసీ ఓ కథనాన్ని ప్రసారం చేస్తూ, అమెరికా అణు సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారని వెల్లడించింది. గడచిన వేసవిలో జాతీయ భద్రతా అధికారులతో సమావేశమైన వేళ, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. వీటినే ప్రస్తావించిన ట్రంప్, సదరు చానల్ అసత్యాలు ప్రసారం చేసిందని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News