dasna jail: దస్నా జైలు నుంచి సోమవారం విడుదలకానున్న తల్వార్ దంపతులు
- కోర్టు ఆదేశాలు ఇంకా తమకు చేరలేదన్న జైలు అధికారులు
- రేపు, ఎల్లుండి సెలవు కావడంతో సోమవారం విడుదల
- సీబీఐ కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం
ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నూపుర్, రాజేశ్ తల్వార్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు ప్రకారం వారు ఇవాళ విడుదల కావాల్సి ఉంది. కానీ తమకు ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశం రాలేదని దస్నా జైలు అధికారులు చెబుతున్నారు.
రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో వారు ఇంకా రెండ్రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. సోమవారం కోర్టు ఆదేశం రాగానే వారిని విడుదల చేయనున్నట్లు సమాచారం. వారి విడుదలకు సంబంధించిన ఆదేశ పత్రాలను తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు గానీ, వారికి శిక్ష విధించిన సీబీఐ కోర్టు గానీ పంపించే అవకాశాలున్నాయని, ఎక్కడి నుంచి ఆదేశం వచ్చినా తాము తల్వార్ దంపతులను విడుదల చేస్తామని దస్నా జైలు సూపరింటెండెంట్ దాదిరామ్ మౌర్య తెలిపారు.