fatima sheik: 'నా షేమ్ లెస్ సెల్ఫీ ఇదే' అన్న దంగల్ నటి... లక్షల్లో లైక్ లు వేలల్లో తిట్లు!

  • మరో బోల్డ్ ఫోటో షేర్ చేసిన ఫాతిమా సనా
  • వెల్లువెత్తిన కామెంట్లు
  • ఇటీవలి ఓ ఫోటోకు బెదిరింపులు

గత కొంతకాలంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా ఖాతాల్లో పోకిరీలు కొందరు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నారని వాపోతున్న 'దంగల్' నటి ఫాతిమా సనా షేక్, మరోసారి వార్తల్లో నిలిచింది. కాస్త బోల్డ్ గా ఓ సెల్ఫీ తీసుకుని, 'నా షేమ్ లెస్ సెల్ఫీ ఇదే' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది.

ఇక ఆ మరుక్షణం నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. నువ్వు నిజంగా సిగ్గులేకుండానే ఇలాంటి ఫోటో పెట్టావని కొందరు తిడితే, ఈ ఫోటోలు నీపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయని మరికొందరు నిప్పులు చెరిగారు. ఈ ఫోటో దాదాపు లక్ష లైకులు సంపాదించగా, వేల కొలదీ కామెంట్లు తెచ్చుకుంది. ఇటీవలి బీచ్ లో కూర్చుని ఉన్న ఫోటోను ఫాతిమా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫాతిమా పోస్టు చేసిన తాజా ఫోటోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News