trichi: ప్రదక్షిణ నిషేధమున్న గుడిలో చుట్టూ తిరగబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
- 2,400 అడుగుల ఎత్తులో పెరుమాళ్ ఆలయం
- ప్రదక్షిణలపై నిషేధం
- అయినా చుట్టూ తిరగబోయి కాలుజారిన యువకుడు
తలమాలై కొండలపై ఉన్న పెరుమాళ్ ఆలయం... తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో 2,400 అడుగుల ఎత్తయిన కొండ శిఖరంపై ఉన్న గుడి. ఈ గుడిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలపై నిషేధం అమలులో ఉంది. నిబంధనలను మీరి, గుడి చుట్టూ తిరగాలని చూసిన ఓ యువకుడు కాలు జారి లోయలో పడి మరణించగా, ఆ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆ యువకుడి పేరు ఆర్ముగం అని తెలుస్తోంది.
ఆర్ముగం ప్రదక్షిణ ప్రారంభించిన వేళ, పక్కన ఉన్న కొందరు అతన్ని వీడియో తీశారు. తన కాలు అదుపు తప్పిందని ఆర్ముగం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీడియో తీస్తున్నవారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాగా, ఇక ఇక్కడ గుడి చుట్టూ తిరగడంపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అధికారులు తెలిపారు. రోజూ పదుల సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయానికి, ప్రస్తుతం పురత్తసి మాసం (సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే తమిళ మాసం) కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని వెల్లడించారు.