ramgopal varma: లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర్నుంచి మొదలయ్యే ఘట్టం మోస్ట్ ఇంటరెస్టింగ్ అనిపించింది!: వర్మ

  • ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పినప్పుడు క్లారిటీ లేదు 
  • ఏం చేయాలనే విషయంలో ఆ తరువాత స్పష్టత వచ్చింది
  • లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి మొదలైన ఘట్టం మోస్ట్ ఇంటరెస్టింగ్
    గా అనిపించింది      

తాను ఎన్టీఆర్ బయోపిక్ చేయనున్నట్టు ముందుగా చెప్పిన వర్మ, ఆ తరువాత ఆ సినిమాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అక్కడి నుంచే అసలు వివాదం మొదలైంది. ఈ విషయాన్ని గురించి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఎదురైన ప్రశ్నకి వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

"మొదటిసారిగా ఎనౌన్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించాలనే ఆలోచన సీరియస్ గానే వుండేది గానీ, ఎలా తీయాలి? .. ఏం తీయాలి? అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఆ తరువాత యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు లక్ష్మీ పార్వతి ప్రమేయంతో కూడిన అంశాలు కంటపడటంతో సడెన్ గా ఈ ఐడియా స్ట్రైక్ అయింది" అన్నారు.

 "వాస్తవానికి ఎన్టీఆర్ స్టార్ కావడం .. సూపర్ పొలిటీషియన్ కావడం ఇవన్నీ కూడా రెండు గంటల్లో జస్టిస్ చేయడం సాధ్యంకాని పని. ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా కలిగింది? ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ .. లక్ష్మీపార్వతి ఎలా వచ్చింది? ఇవన్నీ నాకు 'మహాభారతం'లోని చాఫ్టర్స్ లా అనిపించాయి. లక్ష్మి పార్వతి ఎంటరైన దగ్గర నుంచి ఎన్టీఆర్ చనిపోయేవరకూ గల ఘట్టం నాకు మోస్ట్ ఇంటరెస్టింగ్ గా అనిపించింది. అందువల్లనే దానిని కథావస్తువుగా తీసుకున్నాను" అని వర్మ చెప్పుకొచ్చారు.           

  • Loading...

More Telugu News