flight journey: విమాన ప్రయాణంలో మీ లగేజీ భద్రమేనా?.... ఒకసారి ఈ వీడియో చూడండి!
- తెలియకుండా బ్యాగులు చెక్ చేస్తున్న సిబ్బంది
- `లగేజీకి భద్రత లేదా?` అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
- వీడియో షేర్ చేసిన మణిపూర్ ముఖ్యమంత్రి
విమానాశ్రయంలో బోర్డింగ్కి ముందు లగేజీ చెకిన్ చేసిన తర్వాత లగేజీ భద్రత గురించి ప్రయాణికులు పెద్దగా పట్టించుకోరు. విమానయాన సంస్థ సేవల మీద నమ్మకంతో తమ లగేజీ భద్రంగానే ఉంటుందని అనుకుంటుంటారు. కానీ నిజానికి అది కేవలం భ్రమ మాత్రమే అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
లగేజీ చెకిన్ తర్వాత కార్టన్లోకి నింపేటపుడు తాళం వేసి ఉన్న బ్యాగులను సిబ్బంది చెక్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన వారందరికీ విమాన ప్రయాణాల్లో తమ లగేజీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో `మా లగేజీకి భద్రత లేదా?` అంటూ విమానయాన మంత్రిత్వ శాఖ, విమాన సంస్థలను ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా షేర్ చేశారు.