venumadhav: 'రచ్చ' షూటింగులో పడిపోయిన దగ్గర నుంచే పుకార్లు మొదలయ్యాయి: హాస్యనటుడు వేణుమాధవ్
- వేణుమాధవ్ కి ఫిట్స్ వున్నాయంటూ ప్రచారం
- అందులో నిజం లేదంటూ ఆయన సమాధానం
- తరచూ పడిపోతుంటాననేది అబద్ధం
వేణుమాధవ్ కి ఫిట్స్ ఉన్నాయనీ .. షూటింగ్స్ లో ఆయన పడిపోతూ ఉంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ కారణంగానే ఆయనకి ఛాన్సులు తగ్గాయని చెప్పుకుంటూ వుంటారు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్స్ ప్రస్తావించగా .. ఆయన తనదైన శైలిలో స్పందించారు. తనకి ఫిట్స్ లేవనీ .. ఇదంతా పుకారు మాత్రమేనని అన్నారు.
'రచ్చ' సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే, మరో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండేవాడినని వేణుమాధవ్ చెప్పారు. ఆ సినిమాల షూటింగ్స్ చూసుకుని 'రచ్చ' సెట్ కి వచ్చేవాడినని అన్నారు. అందువలన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ .. నైట్ డిన్నర్ చేయడం కుదిరేది కాదని చెప్పారు. దాంతో ఓ రోజున కళ్లు తిరిగి 'రచ్చ' షూటింగులో పడిపోయాననీ, అప్పటి నుంచి తనపై అనేక పుకార్లు రావడం మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక 'బృందావనం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కార్యక్రమం 'జీన్స్'కి వెళ్లినప్పుడు, అక్కడ కూడా పడిపోయాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు.