america: మరో సంస్కరణకు తెరతీయనున్న ట్రంప్.. భారతీయులకు నష్టమే

  • వైద్య రంగంలో సంస్కరణకు తెరతీసిన ట్రంప్
  • ఇప్పటికే వీసాలు, ఉద్యోగావకాశాలు, ఆరోగ్యబీమా, అమెరికా ప్రవేశాలు వంటి విభాగాల్లో సంస్కరణలు తెచ్చిన ట్రంప్
  • డాక్టర్ రాసే చీటీపై ఇచ్చే మందుల ధరల సమీక్షకు నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంస్కరణకు తెరతీయనున్నారు. వీసాలు, ఉద్యోగావకాశాలు, ఆరోగ్యబీమా.. ఇలా ప్రతి అంశంలోనూ మార్పులు చేర్పులు చేస్తున్న ట్రంప్ తాజాగా వైద్యరంగంలో సంస్కరణకు తెరతీశారు. మందుల ధరలు దిగివచ్చేలా చేసేందుకు సరికొత్త పాలసీని తీసుకొస్తామని ఆయన తెలిపారు. విదేశాల్లో తక్కువ ధరకు అమ్మే మందులను అమెరికాలో మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా మందుల ధరలను అమెరికా ప్రభుత్వం కాకుండా డ్రగ్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అమెరికా ఇచ్చే రాయితీలతో ఈ కంపెనీలు విదేశాల్లో తక్కువ ధరకు మందులు అమ్ముతున్నాయని ఆయన ఆరోపించారు.

 మందుల ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో అమ్మే మందుల ధరలను అమెరికా ప్రభుత్వం కాకుండా డ్రగ్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయని, ఈ విధానం మారాలని వైట్ హౌస్ లో కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తమ మందులను అమెరికాలో మార్కెట్ చేసుకునే భారత్ లోని డ్రగ్ కంపెనీలకు కష్టకాలం మొదలౌతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

  • Loading...

More Telugu News