trump: మీడియా నాపై యుద్ధం ప్రకటించింది: ట్రంప్
- మీడియాపై విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్
- మీడియా తనను బద్నాం చేస్తోందని మండిపాటు
- మంచి పనులు చేసినా, తప్పులు వెదుకుతోంది
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మీడియా అంటే పడదని మరోసారి రుజువైంది. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి మీడియాపై దురుసు వ్యాఖ్యలతో అక్కసు వెళ్లగక్కతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాపై విరుచుకుపడుతూ, అమెరికా మీడియా తనపై కక్ష కట్టి, యుద్ధాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. మీడియా తన గురించి కట్టుకథలనే ఎక్కువగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మంచి పనులు చేసినా, వాటిలో తప్పులు వెదుకుతూ తనను కించపరచాలని మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలోని మొత్తం ఓటర్లలో 46 శాతం మంది మీడియా ప్రచారం చేస్తున్న కట్టుకధలనే నమ్ముతున్నారని తెలిపారు. అలాంటి వారికి తాను చేసిన పనులు రుచించవని అన్నారు. మీడియా సంస్థల కారణంగానే తనపై వ్యతిరేకభావన కలుగుతోందని ఆయన అన్నారు.