tamilnadu: తమిళనాట భారీ ప్రమాదం...40 మందితో కొండపై నుంచి కింద పడిన బస్సు!

  • తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న భక్తులు
  • తిరుగు ప్రయాణంలో డ్రైవర్ అతివేగంతో బ్రేక్ పడకపోవడంతో 30 అడుగుల కొండపై నుంచి రోడ్డు మీద పడిన బస్సు
  • బస్సులో 40 మంది ప్రయాణికులు, అంతా మధురై జిల్లావారిగా గుర్తింపు

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించేందుకు మధురై జిల్లాకు చెందిన 40 మంది భక్తులు వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండ దిగుతుండగా బస్సు అదుపు తప్పింది. దీంతో 30 అడుగుల ఎత్తుపై నుంచి అది కింద పడిపోయింది.

అయితే భక్తుల అదృష్టంకొద్దీ బస్సు అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోకుండా ముందుగా ఓ వేపచెట్టుపై పడింది. ఆ తరువాత ముందు భాగం నేలను తాకింది. ఆ తరువాత నెమ్మదిగా కింద రోడ్డుపై వెళ్తున్న ఆటోపై నుంచి రోడ్డు మీద బస్సు వెల్లకిల పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది తలలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కింద ప్రయాణిస్తున్న ఆటోపై బస్సు పడడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  

  • Loading...

More Telugu News