raja the great: ఎయిర్ పోర్టులో 'రాజా ది గ్రేట్' పైరసీ చూస్తున్న వ్యక్తి.. దర్శకుడి ఆవేదన!

  • పైరసీ బారి నుంచి పరిశ్రమను కాపాడండి
  • సినిమాను థియేటర్ లోనే చూడండి
  • అనిల్ రావిపూడి విజ్ఞప్తి 

ఏ భాషలో చిత్రమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పైరసీ. ఇది అందరికీ తెలిసిన సంగతే. సినిమా తయారీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రూపంలో పైరసీ బాధిస్తూనే ఉంటుంది. ఇక గత వారం విడుదలైన రవితేజ కొత్త చిత్రం 'రాజా ది గ్రేట్' విడుదలైన రెండో రోజే పైరసీకి గురైంది. ఈ చిత్రం పైరసీ వీడియోను ఓ యువకుడు శంషాబాద్ ఎయిర్ పోర్టు లాంజ్ లో కూర్చుని తన ల్యాప్ టాప్ లో చూస్తుండగా, మరో యువకుడు ఫోటో తీసి ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు.

"ఎయిర్ పోర్టు లాంజ్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమాలు. చాలా దురదృష్టకరం. సినిమాలను బతికించండి ప్లీజ్" అని వ్యాఖ్యానించాడు. దీన్ని చూసిన చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, కొంతమంది తమ చిత్రాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటున్నారని, ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయవద్దని కోరాడు. సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని కోరాడు.

  • Loading...

More Telugu News