AP: ఏపీ పురోగతికి యూఏఈ ఫిదా.. కలిసి పనిచేసేందుకు రెడీ!

  • ఏపీ అభివృద్ధిని ప్రశంసించిన యూఏఈ ఆర్థిక మంత్రి
  • పలు రంగాల్లో కలిసి పనిచేస్తామని హామీ
  • ఏపీ నుంచి  సర్వీసుల ప్రారంభానికి ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సంస్థలు సుముఖం

నవ్యాంధ్ర ప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడాన్ని యూఏఈ ప్రభుత్వం ప్రశంసించింది. ఏపీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూఏఈ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దేశ ఆర్థిక మంత్రి బిన్ సయీద్ అల్ మన్సూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాలు పలు రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఓ సంయుక్త కార్య బృందాన్ని ఏర్పాటు చేసి దాన్ని సమన్వయం చేసే బాధ్యతను ఏపీ ఈడీబీకి అప్పగించాలని నిర్ణయించారు. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని ఖరారు చేసి తమ రాయబారి ద్వారా తెలియజేస్తామని మన్సూరీ తెలిపారు.

ఈ సందర్భంగా మన్సూరీ మాట్లాడుతూ రవాణా మార్గాలను ఏపీ అభివృద్ధి చేస్తున్న తీరు తమకు నచ్చిందని కొనియాడారు. వేగంగా అభివృద్ధి ఫలాలను అందుకుంటోందని ప్రశంసించారు. లాజిస్టిక్స్ రంగంలో ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, భారతదేశం మొత్తానికి ఏపీ భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉందని పేర్కొన్నారు. రహదారి, రైలు, జలమార్గాలు మూడింటితో అనుసంధానమై ఉందన్నారు. ఏపీ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసులు నడపాల్సిందిగా ఈ సందర్భంగా ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సంస్థలను చంద్రబాబు కోరారు. దీనికి ఆ రెండు సంస్థలు సానుకూలంగా స్పందించాయి.

  • Loading...

More Telugu News