moustachid: మీసాలు, గడ్డంతో మోనాలిసా చిత్రం... వేలంలో అధిక ధర పలికిన వైనం
- 6,32,500 యూరోలు పలికిన చిత్రం
- పారిస్‌లో జరిగిన సూథ్బే వేలం
- చిత్రాన్ని గీసింది మార్షల్ డూఛాంప్
లియొనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రానికి చిన్న మార్పులు చేస్తూ గీసిన మీసాలు, గడ్డంతో ఉన్న మోనాలిసా చిత్రపటం వేలంలో అధిక ధర పలికింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన సూథ్బే వేలంలో ఈ చిత్రపటం 6,32,500 యూరోలకు అమ్ముడు పోయింది. ఈ చిత్రాన్ని ఫ్రెంచ్ చిత్రకారుడు మార్షల్ డూఛాంప్ 1964లో వేశాడు. అనుకున్న ధర కంటే ఎక్కువ ధర పలకడంతో వేలం నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఆర్థర్ బ్రాండ్ అనే వ్యక్తి వద్ద ఉన్న 110 వస్తువులను సూథ్బే వారు ఈ వేలంలో ఉంచారు. వీటిలో అమ్ముడుపోయిన వాటన్నింటి విలువ 3.9 మిలియన్ యూరోలు ఉండొచ్చని సమాచారం. మార్షల్ డూఛాంప్ వేసిన తొమ్మిది చిత్రాలను ఈ వేలంలో అందుబాటులో ఉంచారు.