relangi narasimha rao: కృష్ణగారికి చాలా కోపం వచ్చింది .. ఆ తరువాత అర్థం చేసుకున్నారు : రేలంగి నరసింహారావు
- కృష్ణగారితో ఓ సినిమా చేయాల్సింది
- ఆ కారణంగా అది వదులుకోవలసి వచ్చింది
- కృష్ణగారికి కోపం వచ్చింది
- ఆయన్ని కలిసి విషయం చెప్పాను
రాజేంద్రప్రసాద్ .. చంద్రమోహన్ వంటి హీరోలతో చిన్న సినిమాలు చేసిన రేలంగి నరసింహారావు, అక్కినేని .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హీరోలతోను సినిమాలు చేశారు. అలాంటి రేలంగి నరసింహారావు .. కృష్ణగారితో ఓ సినిమా చేయాల్సింది కానీ ఆ ఛాన్స్ మిస్సయ్యింది. అందుకుగల కారణాన్ని ఆయన తెలుగు పాప్యులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
" నేను శోభన్ బాబుతో చేసిన 'సంసారం' హిట్ కావడంతో, ఆ నిర్మాత శాఖమూరి రామచంద్రరావు తదుపరి సినిమాను కృష్ణగారితో చేయాలనుకున్నారు .. వాళ్లిద్దరూ బంధువులు కూడా. ఆ సినిమా చేస్తానని చెప్పిన కృష్ణగారు .. తననే దర్శకుడిగా తీసుకోమని ఆ నిర్మాతతో చెప్పారు. తనని ఆ సినిమాకి దర్శకుడిగా తీసుకోవడంతో .. రైటర్ సత్యానంద్ తో సిటింగ్స్ మొదలు పెట్టాను
"అయితే కొన్ని కారణాల వలన ఆ నిర్మాత తనకి చెప్పకుండా పరుచూరి బ్రదర్స్ తో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి .. ఆ తరువాత ఆ విషయం నాకు చెప్పారు. " రైటర్ గా సత్యానంద్ ను ఫిక్స్ చేసి .. సిటింగ్స్ జరుగుతుండగా తీసేయడం కరెక్ట్ కాదు. సత్యానంద్ ను తీసేయడానికి నా మనసు అంగీకరించడం లేదు .. నేను కూడా పక్కకి తప్పుకుంటాను .. మరో డైరెక్టర్ ను పెట్టుకోండి అంటూ తప్పుకున్నాను.
"అయితే, రేలంగి నరసింహారావుకి ఈ సినిమా చేయడం ఇష్టం లేదట" అంటూ కృష్ణగారికి రాంగ్ మెసేజ్ వెళ్లడంతో, ఆయనకి కోపం వచ్చింది. ఆ సంగతి తెలిసి నేను వెళ్లి జరిగింది చెప్పాను. అప్పుడాయన అర్థం చేసుకుని .. మరో సినిమా చేద్దాం" అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.