flights on road: ఆగ్రా హైవేపై యుద్ధవిమానాలు... రిహార్సల్స్ ను చూసేందుకు ఎగబడిన జనం!
- ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై విమానాలు ల్యాండింగ్
- నేటి తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన యుద్ధవిమానాల విన్యాసాలు
- రోడ్డుపై దిగుతున్న విమానాలను చూసేందుకు పోటెత్తిన జనం
ఆగ్రాలోని ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడం ఆగ్రా పరిసరాల్లోని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నేటి తెల్లవారుజామున ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రా దగ్గర ఢిల్లీ-లక్నో జాతీయ ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాలు విన్యాసాలు చేశాయి.
యుద్ధ సమయాల్లోను, అత్యవసర సేవల సమయంలోను విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలిసారి నడిరోడ్డుపై యుద్ధ విమానాలు ఈ విన్యాసాలు చేశాయి. వీటిని చూసేందుకు స్థానికులు రోడ్డుకిరువైపులా పోటెత్తారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు. అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు రన్ వేలు చాలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.