airlines: మారనున్న ఎయిర్ లైన్ రూల్స్... ఇకపై చెకిన్ బ్యాగేజీలో ల్యాప్ టాప్ లపైనా నిషేధం
- ఇప్పటికే పవర్ బ్యాంకులపై నిషేధం
- మొబైల్ చార్జర్లు, ఈ సిగరెట్లపై కూడా
- పేలితే కనుక్కోవడం కష్టం
- క్యాబిన్ బ్యాగేజీలో మోసుకెళ్లాల్సిందే
ఇప్పటికే పవర్ బ్యాంకులు, పోర్టబుల్ మొబైల్ చార్జర్లు, ఈ సిగరెట్లను చెకిన్ లగేజీ నుంచి నిషేధించిన భారత విమానయాన శాఖ, ఇకపై ల్యాప్ టాప్ లపైనా నిషేధం విధించనుంది. ఇటీవల న్యూఢిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరిన ఓ విమానంలో ప్రయాణికుడి సెల్ ఫోన్ పేలగా, క్యాబిన్ క్రూ అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలు చెకిన్ లగేజీలో ఉంచడాన్ని రద్దు చేశాయి.
ఇదే విధమైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ సంస్థలు భావించినట్టు తెలుస్తోంది. ల్యాప్ టాప్ వంటి వస్తువులు ప్రమాదవశాత్తూ పేలితే దాన్ని కనుక్కోవడం కష్టమన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అమలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులైనా క్యాబిన్ లగేజీతో పాటు మోసుకు వెళ్లాలే తప్ప చెకిన్ చేసేందుకు వీలుండదు.